‘ముగ్గురు కోతులు’ ఫస్ట్ లుక్‌తో వచ్చేశారు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 10:10 AM
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో నవ దర్శకుడు కార్తీక్ గరిమెల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో టైటిల్‌కు తగ్గట్టుగానే ముగ్గురు కుర్రాళ్లు రకరకాల ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ దర్శనమిచ్చారు. పోస్టర్ డిజైన్ చూస్తుంటేనే ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హిలేరియస్ యూత్‌ఫుల్ కామెడీతో రాబోతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకుల్లో సినిమా కాన్సెప్ట్‌పై సరికొత్త క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా, రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే కథ, కథనాలతో నేటి యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో టీజర్, పాటలతో పాటు మరిన్ని ఆసక్తికర ప్రమోషనల్ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నామని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!
షావుకారు జానకి జ్ఞాపకాల్లో సినీ పరిశ్రమ
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టారే