సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MS Raju: 'అగధ' ఆగమనానికి సన్నాహాలు!

ABN, Publish Date - Jun 25 , 2026 | 06:09 PM

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అగధ' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఆగస్ట్ 7న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Agadha Movie

కొన్నేళ్ళ పాటు 'సంక్రాంతి రాజు' అనిపించుకున్న ఎమ్మెస్ రాజు... ఆ తర్వాత కూడా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అదర్ సీజన్స్ లో జనం ముందుకు తీసుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. తండ్రి రాయపరాజు బాటలో సాగుతూ, నిర్మాతగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా... ఓన్ బ్యానర్ సుమంత్ ఆర్ట్స్‌పై నిర్మించిన 'శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తదితర చిత్రాలతో ట్రెండ్‌ సృష్టించారు. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 'డర్టీ హరి', 'మళ్లీ పెళ్లి' చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్‌తో మళ్ళీ సినిమా తీయడానికి ఇష్టపడని ఎమ్మెస్ రాజు తాజాగా 'అగధ' చిత్రాన్ని రూపొందించారు. దాదాపు ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. దీన్ని ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వంలో కాశీ విశాలాక్షి బలుసు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.


ఇటీవల విడుదలైన 'అగధ' టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ విషయం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ, 'ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని రూపొందించాను. 'పొలిమేర' ఫేమ్‌ కామాక్షి భాస్కర్ల అద్భుతంగా నటించింది. అలానే వనిత గారి అమ్మాయి జోవిక ఈ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. ఉల్కా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. ఎడిటర్ జునైద్, కెమెరామెన్ నాని, చైతన్య, రాజీవ్, విక్కీ, రాజేష్ ఇలా అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. ‘అగధ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Updated Date - Jun 25 , 2026 | 06:10 PM