సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: పెద్దిలో మృణాల్ ఐటెంసాంగ్..

ABN, Publish Date - Jan 23 , 2026 | 05:17 PM

టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది (Peddi) ఒకటి. మెగా ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Peddi

Peddi: టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పెద్ది (Peddi) ఒకటి. మెగా ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఉప్పెన లాంటి హిట్ సినిమా తరువాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక చికిరి చికిరి సాంగ్ అయితే పెను సంచలనాన్ని సృష్టించింది. ఎప్పుడెప్పుడు పెద్ది ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27 న పెద్ది రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియదు. కానీ, తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. పెద్దిలో ఒక ఐటెంసాంగ్ ఉందని, ఆ సాంగ్ కోసం మేకర్స్ అందాల భామ మృణాల్ ఠాగూర్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది.

కాజల్ దగ్గరనుంచి శ్రీలీల వరకు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడినవారే. ఆ లిస్ట్ లో మృణాల్ కూడా యాడ్ అయ్యింది. ఈ మధ్యనే ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు హింట్ కూడా ఇచ్చింది. అది పెద్దిలోనే అయితే.. చరణ్ స్టెప్పులు.. మృణాల్ అందాలు కలిసి థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మృణాల్ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని టాక్. మెగా ఫ్యాన్స్ అయితే.. మృణాల్ ని స్పెషల్ చేయించు బుచ్చి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Updated Date - Jan 23 , 2026 | 06:18 PM