సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మౌళి ‘దొంగ నా కొడుకు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

ABN, Publish Date - Oct 06 , 2026 | 09:05 PM

యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాతో నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్న మౌళి మరో ఆసక్తికరమైన సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాతో నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్న మౌళి మరో ఆసక్తికరమైన సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుస్మితా శెట్టి కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ  చిత్రాన్ని నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రాబరీ.. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది.  మౌళికి తండ్రి పాత్రలో  కమెడియన్‌ అలీ నటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.  హీరోహీరోయిన్లతో పాటు సినిమాలోని ఇతర పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతోంది. సింజిత్‌ యర్రమిల్లి సంగీతం అందిస్తుండగా.. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - Oct 06 , 2026 | 09:10 PM