మౌళి ఎవడు కామెంట్స్ పై స్పందించిన హీరో.. నన్ను బెదిరించారు
ABN, Publish Date - Oct 21 , 2026 | 07:29 PM
యువ నటుడు, సోషల్ మీడియా సెన్సేషన్ మౌళి తనుజ్ ప్రశాంత్ (Mouli) హీరోగా తెరకెక్కిన చిత్రం దొంగ నా కొడుకు (Donga Naa Koduku). శ్రీను కంభాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
యువ నటుడు, సోషల్ మీడియా సెన్సేషన్ మౌళి తనుజ్ ప్రశాంత్ (Mouli) హీరోగా తెరకెక్కిన చిత్రం దొంగ నా కొడుకు (Donga Naa Koduku). శ్రీను కంభాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మౌళి.. యాంకర్ రోషన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ మిథిలేష్ ని ఇంటర్వ్యూ చేసే క్రమంలో రోషన్, మౌళి ఎవడు.. ? లిటిల్ హార్ట్స్ తరువాత అతనిని ఎవరు గుర్తుపెట్టుకున్నారు.. అసలు ఏ సినిమాలు చేస్తున్నాడు.. అని డీగ్రేడ్ చేసినట్లు మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలపై మౌళి స్పందిస్తూ తనకు చాలా బాధనిపించిందని తెలిపాడు.
ఒక పెద్ద సినిమా కుటుంబం నుంచి వస్తే ఇలాగే అనేవారా? లేక చిన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడనే చిన్నచూపా? అనిపించింది. లిటిల్ హార్ట్స్ హిట్ అయిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో నేను చాలా జెలసీని, హేట్ ను, అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అవేవీ బయట చెప్పుకోలేను. చ్చిన సినిమా చేసుకోవడం కోసం, అనుకున్న గోల్ రీచ్ అవ్వడం కోసం ఎవరైనా భయపెడితే భయపడతాను. తిడితే పడతాను. అంతకు మించి నేనేమి చేయలేను. సినిమా విడుదలైన తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నుంచి నాకు ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చింది. అప్పుడు ఫీవర్ తో ఉన్నాను,. రాలేను అని చెప్పాను. వెంటనే నాతోనే నీ నెక్స్ట్ సినిమాకి నెగిటివ్ అవుతదేమో చూసుకో మరి డైరెక్ట్‌గా బెదిరించారు. ఆ భయంతోనే నేను ఇంటర్వ్యూకి వెళ్లాను. ఎవరైనా సరే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సానుభూతితో , పాజిటివ్‌గా చూడాలని' చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం దొంగ నా కొడుకు సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. నవంబర్ 13 న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాతో మౌళి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇది కూడా మంచి హిట్ అయితే మౌళిని అందరు గుర్తుపట్టేకొనేలా అవుతాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.