మోక్షజ్ఞ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్లు?

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:05 PM

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య హీరోయిన్లు ఇద్దరు కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Balakrishna and Mokshagna

‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) త్వరలోనే టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. ‘బింబిసార’ చిత్రంతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ (Vasishta Mallidi) దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన అధికారిక ప్రకటనతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ‘సింబా’ అనే వర్కింగ్ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి రోజుకో క్రేజీ వార్త ఫిల్మ్‌నగర్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే, ఊహాగానాలు ఒక రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ గ్లామర్ క్వీన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. అదీ కూడా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, సీనియర్ నటి శోభన కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారట. ఆమె మోక్షజ్ఞకు తల్లి పాత్రలో కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రవీనా టాండన్ (Raveena Tandon), శోభన (Sobhana) వంటి దిగ్గజ నటీమణులు మోక్షజ్ఞ తొలి చిత్రంలో నటిస్తే.. ఈ సినిమా రేంజ్, గ్రాండ్‌నెస్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


ఇక మోక్షజ్ఞను ఏదో రొటీన్ మాస్ యాక్షన్ కథతో కాకుండా, చాలా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. అందుకే దర్శకుడు వశిష్ఠను ఎంచుకున్నారట. ఈ చిత్రాన్ని భారీ సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో, మల్టిపుల్ టైమ్‌లైన్స్, పునర్జన్మలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ హంగులతో రూపొందిస్తున్నారని టాక్. ఇటీవలే ఈ కథను బాలకృష్ణ స్వయంగా విన్నారట. కథ విని చాలా ఇంప్రెస్ అయిన బాలయ్య.. సెకండ్ హాఫ్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చేందుకు కొన్ని కీలక సూచనలు, మార్పులు చేశారట. వశిష్ఠ మేకింగ్ శైలిపై నమ్మకంతో ఉన్న నందమూరి కాంపౌండ్.. ఈ ప్రాజెక్ట్‌ను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే పనిలో ఉంది.


ఈ ప్రాజెక్ట్‌లో స్వయంగా నందమూరి బాలకృష్ణ కూడా ఒక అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. నిజ జీవితంలో లాగే వెండితెరపై కూడా మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే బాలయ్య కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో బాలయ్య ఇచ్చే ఎంట్రీ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. ఇక మోక్షజ్ఞ సరసన జోడీగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల నటించనుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై ఫ్రెష్‌నెస్‌ను తెస్తుందని భావిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం లీకుల రూపంలో వస్తున్న రూమర్స్ అయినప్పటికీ.. వీటిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ బయటకు వస్తేనే ఈ సోషియో-ఫాంటసీ వండర్ ఎలా ఉండబోతుందో స్పష్టత వస్తుంది. మరి మోక్షజ్ఞ తన తొలి సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు

Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..

ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత

Updated Date - Oct 04 , 2026 | 05:05 PM