హే బాబు.. వెళ్లు! మ‌నవ‌డి రచ్చ‌కు.. మోహ‌న్‌బాబు షాక్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:15 AM

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు అంటే టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు.

mohanbabu

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు అంటే టాలీవుడ్‌లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. ఇండ‌స్ట్రీలోని పెద్ద న‌టులు, టెక్నీషియ‌న్లు, ఆయ స‌మ‌కాలీనులు సైతం అయ‌న‌తో మాట్లాడాలంటేనే ముందు వెన‌కాల ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. జాగ్ర‌త్త‌గా మ‌సులుతుంటారు.

అలాంటి మంచు మోహ‌న్ బాబు (Mohan Babu) ను ఆయ‌న మ‌నుమ‌డు విష్ణు (ManchuVishnu) కుమారుడు అవ్‌రామ్ (Avram Manchu) ఓ అటాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతుండ‌గా అది చూసిన వారంతా మోహ‌న్‌బాబు అంత‌టివాడికి ఎంత పరిస్థితి వ‌చ్చిందంటూ ఫ‌న్నీగా కామెంట్ చేస్తున్నారు.

మోహ‌న్ బాబు, విష్ణు ఓరూంలో కూర్చోని మాట్లాడుకుంటూ ఉండ‌గా మ‌నుమ‌డు అవ్‌రామ్ వ‌చ్చి విష్ణుపై ప‌డి అల్ల‌రి చేయ‌డం ఇది చూసిన మోహ‌న్ బాబు కామ్ గా ఉండాలి అల్ల‌రి చేయొద్దు అన‌గా అవ‌ర్‌రామ్ ఏ బాబు అంటూ మోహ‌న్‌బాబును ఆట‌ప‌ట్టించ‌డం క‌ళ్లలోకి క‌ల్లు పెట్టి చూసి బెదిరించ‌డం, గ్రౌండ్ చేయ్‌, వెళ్లిపో అంటూ కాసేపు అల్లాడించాడు.

చివ‌ర‌కు అవ్‌రామ్‌ అంతా ర‌చ్చ చేసి బాయ్ బాబు అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం అది చూసి మోహ‌న్ బాబు షాకింగ్ లుక్‌ ఇవ్వ‌డం అంతా సూప‌ర్ ఫ‌న్ పంచింది. ఆల‌స్యం చేయ‌కుండా మీరూ ఆ వీడియో చూసేయండి.

Updated Date - Apr 16 , 2026 | 11:18 AM