Mohan Lal: మమ్ముట్టికి మోహన్‌లాల్ అభినందనలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:35 PM

తన మిత్రుడు మమ్ముట్టికి, నటుడు మోహన్ లాల్ శుభాకాంక్షలు తెలిపారు.

తన మిత్రుడు మమ్ముట్టికి (Mammootty), నటుడు మోహన్ లాల్ (Mohan lal) శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మయుగం' (Bramayugam) చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మమ్ముట్టికి మోహన్‌లాల్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రియమైన ఇచాక్కా సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన అసాధారణమైన నటనా ప్రతిభకు, సినీ ప్రయాణానికి ఈ పురస్కారం సరైన గుర్తింపు అని కొనియాడారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ మేరకు మోహన్ లాల్  ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి జాతీయ అవార్డు అందుకోవడంపై కూడా మోహన్‌లాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆమె అద్భుతమైన ప్రతిభకు లభించిన ఈ గౌరవం ఎంతో సముచితమైనదని అన్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో  షెహనాద్ జలాల్‌కు, ఉత్తమ మలయాళ చిత్రంగా ఎంపికైన 'ఫెమినిచ్చి ఫాతిమా' చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు ఫాసిల్ మహమ్మద్‌తో పాటు మొత్తం చిత్ర యూనిట్ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. 

అలాగే బాలీవుడ్ నుంచి కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్, ధనుష్‌తో పాటు దేశవ్యాప్తంగా అవార్డులు అందుకున్న ప్రతి నటుడు, దర్శకుడు, రచయిత, సాంకేతిక నిపుణుడికి మోహన్‌లాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సినిమా గొప్పతనం, వైవిధ్యం, సృజనాత్మకతను జాతీయ చలనచిత్ర అవార్డులు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయని మోహన్‌లాల్ అన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై వివిధ భాషల చిత్రాలకు, కళాకారులకు గుర్తింపు లభించడం ఎంతో ఆనందకరమైన విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మోహన్‌లాల్ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. విజేతలకు పవన్ శుభాకాంక్షలు

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

Updated Date - Jul 19 , 2026 | 07:06 PM