Pawan Kalyan: తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. విజేతలకు పవన్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:50 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan Kalyan) 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు (National Awards) ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. ప్రముఖ నటులు  మమ్ముట్టి  ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవ సారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి  కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన యామీ గౌతమ్ కు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా 'కల్కి 2898 ఎ.డి', ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898 ఎ.డి., (నితిన్ జిహాని చౌదరి), ఉత్తమ బాలల చిత్రంగా '35 - చిన్న కథ కాదు', ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా  సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ శర్మ) అవార్డులు దక్కించుకోవడం ఎంతో  ఆనందంగా ఉంది. అలాగే నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారానికి ఎంపిక కావడం సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా నిహారిక చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతోపాటు అవార్డులు దక్కించుకొంది. చిత్ర నిర్మాణంలో నిహారిక తోపాటు భాగమైన  పద్మజ కొణిదెల,  జయలక్ష్మి అడపాక, ఈ చిత్ర దర్శకుడు శ్రీ యదు వంశీకి, ఈ చిత్రానికి  ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా అవార్డుకు ఎంపికైన రవి కుమార్ కు శుభాకాంక్షలు' అని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి:

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

Updated Date - Jul 19 , 2026 | 07:21 PM