రోషన్ మేక.. 'జటాయు'కి ముహూర్తం ఫిక్స్
ABN, Publish Date - Nov 09 , 2026 | 09:10 PM
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్లాసిక్ అండ్ క్లాసీ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohan Krishna Indraganti).
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్లాసిక్ అండ్ క్లాసీ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohan Krishna Indraganti). ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. గతేడాది సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్రగంటి భారీ పరాజయన్ని అందుకున్నాడు. ఇక ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కుర్ర హీరో రోషన్ మేకతో జత కట్టాడు. వీరిద్దరి కాంబోలో జటాయు అనే చిత్రం రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ మోస్ట్ యాంబిషియస్ అండ్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ను నవంబర్ 11న గ్రాండ్గా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సన్ ఆఫ్ వైజయంతి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించి ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న ప్రముఖ నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు ఈ జటాయు చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో పాన్-ఇండియా అప్పీల్ ఉండేలా ఈ సినిమాను రూపుదిద్దబోతున్నట్లు సమాచారం. ఈ జటాయు రోషన్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలను నవంబర్ 11న జరిగే పూజా కార్యక్రమంలో అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.
ప్రస్తుతం రోషన్.. ఏమో ఏమో ఇది అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమయ్యింది. మొదట ఈ చిత్రం అక్టోబర్ లోనే రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పటివరకు మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. మరి వరుస చిత్రాలతో స్పీడు పెంచిన రోషన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.