సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీనివాస మంగాపురం: మరో వినూత్న పాత్రలో మోహన్ బాబు

ABN, Publish Date - Feb 28 , 2026 | 03:50 PM

ప్రతినాయక ఛాయలున్న పాత్రలు, సినిమాకు కీలకమైన పాత్రలు విలక్షణ నటుడు మోహన్ బాబుకు కొత్తేమి కాదు. గతంలోనూ చేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు.

ప్రతినాయక ఛాయలున్న పాత్రలు, సినిమాకు కీలకమైన పాత్రలు విలక్షణ నటుడు మోహన్ బాబుకు (mohan babu) కొత్తేమి కాదు. గతంలోనూ చేశారు.. ఇప్పుడూ చేస్తున్నారు. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్‌ భూపతి (Ajay bhupati) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’లో (Srinivasa Mangapuramlo) మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శనివారం ఆయన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో  వెంకటప్పయ్య నాయుడుగా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్ భూపతి వెల్లడించారు. ఆ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నారు. 


దీనిపై మోహన్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'అచంచలమైన నమ్మకానికి ప్రతీకైన కథ.. ఆధిపత్యం చెలాయించే వ్యక్తి'.. 'శ్రీనివాసమంగాపురం'లో  వెంకటప్పయ్య నాయుడు ఇంటెన్స్ ఉన్న పాత్రతో వస్తున్నాను' అని మోహన్ బాబు పేర్కొన్నారు.  ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా రషా థడానీ నటిస్తున్నారు. యధార్థమైన ఆంశాలకు  భావోద్వేగాలను జోడించి   మనసుల్ని హత్తుకునే ప్రేమకథలా ఈ సినిమాను  రూపొందిస్తున్నాం' అని దర్శకుడు తెలిపారు. నాని హీరోగా రానున్న ‘ది ప్యారడైజ్‌’లో మోహన్‌బాబు విలన్‌గా కనిపించనున్నారు.  ఇందులో  ‘శికంజ మాలిక్‌’ అనే విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.   

Updated Date - Feb 28 , 2026 | 03:53 PM