పెదరాయుడుకి ప్యారడైజ్ అయినా కలిసొస్తుందా..
ABN, Publish Date - Aug 03 , 2026 | 09:16 PM
ఒకప్పుడు స్టార్ హీరోలు.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో మెప్పిస్తున్న విషయం తెల్సిందే. కొంతమంది విలన్స్ గా సెటిల్ అయితే.. మరికొంతమంది పాజిటివ్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం రీఎంట్రీ ఇచ్చాడు.
ఒకప్పుడు స్టార్ హీరోలు.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో మెప్పిస్తున్న విషయం తెల్సిందే. కొంతమంది విలన్స్ గా సెటిల్ అయితే.. మరికొంతమంది పాజిటివ్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం రీఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన.. రీఎంట్రీ కూడా విలనిజంతోనే మొదలుపెట్టాడు. అయితే మోహన్ బాబు (Mohan Babu) రీఎంట్రీ బెడిసికొట్టింది. మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్రం చేసిన శ్రీనివాస మంగాపురం చిత్రంలో మోహన్ బాబు ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌పై భారీ అంచనాలే ఉన్నప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. విలన్ గా మోహన్ బాబు విశ్వరూపం చూపిస్తాడేమో అనుకోని వెళ్ళిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. హీరో తాతగా ఆయన పాత్ర ఆశించినంత గుర్తింపును తీసుకురాలేకపోయింది.
ఇక ఇప్పుడు అందరి దృష్టి నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ పైనే పడింది. ఈ సినిమాలో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుండటంతో సినిమాపై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆయన చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఆ కష్టం అంతా పోస్టర్ లో కనిపిస్తుంది. మోహన్ బాబు విలనిజం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల రా అండ్ రస్టిక్ పాత్రలు ఎలా ఉంటాయో దసరా చూస్తే అర్దమవుతోంది. ఇక వీరిద్దరూ కలిస్తే ఆ వైలెన్స్ తట్టుకోవడం కష్టమే.
గతంలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో యముడిగా నటించి మోహన్ బాబు ఏ స్థాయిలో మెప్పించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా ది ప్యారడైజ్ లో మోహన్ బాబుతో అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి శ్రీనివాస మంగాపురం ఇచ్చిన నిరాశను తుడిచిపెడుతూ షికంజా మాలిక్ పాత్రతో మోహన్ బాబు సాలిడ్ కంబ్యాక్ కొడతాడా లేదా అనేది వేచి చూడాలి.