ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్లాప్‌తో ‘మొహబ్బత్’ ప్రారంభం
ABN, Publish Date - Jun 05 , 2026 | 08:29 PM
ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న చిత్రం ‘మొహబ్బత్’. మ్యాక్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా అఫ్రోజ్ షేక్ (Afroz Shaikh) నిర్మిస్తున్న చిత్రం ‘మొహబ్బత్’ (Mohabbat). ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే పాటు దర్శకత్వం అందిస్తున్నారు మ్యాక్. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (MLA Naveen Yadav) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత అఫ్రోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇదే కార్యక్రమంలో చిత్ర ఫస్ట్ లుక్‌ని కూడా నవీన్ యాదవ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మొహబ్బత్’ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. అఫ్రోజ్ అన్న నిర్మాతగా కొత్త వారికి ప్రోత్సాహం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీ కార్మికుల కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాలు ఆపరు.. నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్ అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమాకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్ Mak) మాట్లాడుతూ.. మా నిర్మాత అఫ్రోజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ఈ సినిమా రానుంది. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామన్నారు. చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ.. మా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మొదటి ప్రాజెక్ట్‌గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాం. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్‌లకు ధన్యవాదాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సంతోష్, హీరోయిన్ శ్రేయాసి సేన్, స్టోరీ-డైలాగ్ రైటర్ కలాం మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ సాధించాలని కోరారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!
మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!