సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రూమర్స్‌కు చెక్‌.. యాంకర్‌ మహేంద్రను పెళ్లాడిన నటి శిరీష

ABN, Publish Date - Aug 29 , 2026 | 05:36 PM

బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్‌తో దగ్గరైన నటి శిరీష మరోసారి పెళ్లి పీటలెక్కింది.

బుల్లితెర ప్రేక్షకులకు ‘మొగలిరేకులు’ సీరియల్‌తో దగ్గరైన నటి శిరీష (sireesha) మరోసారి పెళ్లి పీటలెక్కింది. యాంకర్‌ కమ్‌ నటుడు మహేంద్రను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొంతకాలంగా వీరిద్దరి పెళ్లిపై సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వని ఈ జంట.. తాజాగా ఒక్కటై అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. తమ వివాహానికి సంబంధించిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

శిరీష.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆమె అచ్చతెలుగు అమ్మాయి. నటనపై ఆసక్తితో బుల్లితెరపైకి వచ్చిన శిరీషకు ‘మొగలిరేకులు’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘రాములమ్మ’, ‘స్వాతి చినుకులు’, ‘మనసు మమత’, ‘చెల్లెలి కాపురం’, ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ‘త్రిశూలం’ తదితర సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా సీరియల్స్‌లో నటించినప్పటికీ.. శిరీషకు మరింత క్రేజ్‌ వచ్చింది.

ఇక శిరీష వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గతంలో నవీన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో 2024లో భర్త నుంచి విడిపోతున్నట్లు శిరీష ప్రకటించింది. తమ బంధాన్ని ముగించుకున్నామని, పరిస్థితుల కారణంగానే ఇద్దరం విడిపోయామని అప్పట్లో సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని గౌరవించాలని అభిమానులను కోరింది.

కొంతకాలం తర్వాత శిరీష మరోసారి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. . యాంకర్‌, నటుడు మహేంద్రతో ఆమె వివాహం జరిగింది. మహేంద్ర తొలుత ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించాడు. అనంతరం ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ వంటి సీరియల్స్‌లో సహాయ పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలతోనూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.

మహేంద్ర, శిరీషలకు ఎప్పుడు, ఎలా పరిచయం ఏర్పడిందన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఈ జంట శుక్రవారం సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. తమ పెళ్లి విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో అభిమానులు, సహనటులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. శిరీష కంటే మహేంద్ర వయసులో చిన్నవాడని సమాచారం. 

Updated Date - Aug 29 , 2026 | 07:11 PM