Ranabaali: టాక్ మిక్స్‌డ్.. కలెక్షన్లు మాత్రం అదుర్స్.. ‘రణబాలి’ బాక్సాఫీస్ రిపోర్ట్
ABN, Publish Date - Oct 23 , 2026 | 08:14 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ మిక్స్‌డ్ టాక్‌తోనూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన ‘రణబాలి’ (Ranabaali) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదల రోజున మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ముఖ్యంగా విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌లో 77 శాతానికి పైగా రికవరీ సాధించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘జైలర్ 2’తో పోటీ ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విజయ్ దేవరకొండ మార్కెట్‌పై కొత్త చర్చకు దారితీస్తోంది.
దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ ‘రణబాలి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే లభించింది. అయినప్పటికీ పండుగ సెలవులు, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, రష్మిక మందన్నతో ఆయన జంటకు ఉన్న ఆదరణ సినిమా వసూళ్లకు ఫ్లస్ పాయింట్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా సెలవుల సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం సినిమాకు కలిసొచ్చిన అంశంగా భావిస్తున్నారు.
ఆరు రోజుల్లో రూ.33.42 కోట్ల షేర్!
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం.. ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్‌ఈవెన్ టార్గెట్ రూ.43 కోట్లుగా ఉంది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లో రూ.33.42 కోట్ల వరల్డ్‌వైడ్ షేర్ సాధించినట్లు పేర్కొంటున్నారు. అంటే బ్రేక్‌ఈవెన్‌లో ఇప్పటివరకు 77.72 శాతం రికవరీ సాధించినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.ఈ లెక్కల ప్రకారం బ్రేక్‌ఈవెన్ చేరుకోవడానికి సినిమా ఇంకా రూ.9.58 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తొలి వారంలోనే 80 శాతానికి పైగా రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ గణాంకాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్తే కానీ మేకర్స్ నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ ‘రణబాలి’ బ్రేక్‌ఈవెన్ లక్ష్యం దిశగా సాగుతోందని ప్రచారంలో ఉన్న లెక్కలు సూచిస్తున్నాయి. ఆరు రోజుల్లోనే 77.72 శాతం రికవరీ సాధించినట్లు పేర్కొనడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలి వారం ముగిసేలోపు 80 శాతానికి పైగా రికవరీ సాధిస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, మిక్స్‌డ్ టాక్‌ను అధిగమించి ‘రణబాలి’ వసూళ్లలో నిలకడ చూపిస్తే విజయ్ దేవరకొండకు ఇది మరో కీలక విజయంగా నిలిచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి? అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్‌ఈవెన్ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.