Raaka: అల్లు అర్జున్ సినిమాలో మిన్నల్ మురళి నటి
ABN, Publish Date - Jun 01 , 2026 | 04:09 PM
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘రాకా’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే!ఇప్పుడు ఈ చిత్రంలో మరో నటి భాగమయ్యారు. ‘
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘రాకా’ (Raaka) చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో నలుగురు హీరోయిన్స్‌కు అవకాశం ఉందని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ (Deepika Padukone) నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో మరో నటి భాగమయ్యారు. ‘మిన్నల్ మురళి’ ఫేం ఫెమినా జార్జ్ (Femina George)ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
‘రాకా’ లాంటి పెద్ద సినిమాలో అవకాశం వస్తుందని ఊహించలేదు. ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాల్లో అతి పెద్ద సినిమా ఇదే. ఐకాన్‌స్టార్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ నేను చూసిన ఫస్ట్ సినిమా. అప్పటి నుంచే బన్నీకి పెద్ద అభిమానినయ్యా. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం మాత్రం కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్యనే ఆమె ‘డిస్కో’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా. అప్పుడే ‘రాకా’ టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా జార్జ్ 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’తో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు.