భరతవర్ష.. అమ్మవారి పాట.. అదిరిపోయింది

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:44 PM

ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురచూస్తోన్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా హిట్ ట్రాక్ మాత్రం ఎక్కలేకపోతున్నాడు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడులా ఇండస్ట్రీపై హిట్ కోసం యుద్దం చేస్తూనే ఉన్నాడు.

BharataVarsha

ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురచూస్తోన్న హీరోల్లో గోపీచంద్ (Gopichand) ఒకడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా హిట్ ట్రాక్ మాత్రం ఎక్కలేకపోతున్నాడు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడులా ఇండస్ట్రీపై హిట్ కోసం యుద్దం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం గోపకీయహన్ ఆశలన్నీ 'భరతవర్ష – సాగా ఆఫ్ శూల' (BharataVarsha – Saga of Shula) సినిమాపైనే పెట్టుకున్నాడు. టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రీతు వర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా భరతవర్ష నుంచి అమ్మ కదిలి వచ్చే అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనుదీప్ దేవ్ అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అమ్మవారిని కుల దైవంగా భావించే భక్తులు మొక్కులు చెల్లించడానికి వెళ్తున్న సమయంలో ఆ దేవత గురించి.. ఆమె రూపాల గురించి లిరిక్స్ లో ఎంతో అద్బుతంగా వివరించారు. ఈ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి తీపిర్నేని లిరిక్స్ అందించగా.. స్కంద వెలువల్లి తన గానంతో మరింత హైప్ తెచ్చారు. ఇక విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తానికి ఈ సాంగ్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పొచ్చు.


భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి తనదైన టేకింగ్‌తో మరో అద్భుతాన్ని సృష్టిస్తున్నాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Oct 14 , 2026 | 07:44 PM