‘ఆస్మాన్’ టీజర్.. మేఘాంశ్ శ్రీహరి అదరగొట్టాడుగా
ABN, Publish Date - Sep 16 , 2026 | 03:55 PM
మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదలైంది. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో కొత్త లుక్, యాక్షన్ సన్నివేశాలు, ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం ఆకట్టుకుంటున్నాయి.
దివంగత రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి (Meghamsh Srihari) పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ విడుదలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే శ్రీహరి జయంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, తాజాగా వచ్చిన టీజర్ కథపై కొత్త అంచనాలను రేకెత్తిస్తోంది. “మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే” అంటూ వినిపించే డైలాగ్స్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డార్క్ సీక్రేట్స్ నేపథ్యం చుట్టూ తిరిగే కథను సూచించేలా టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు.
టీజర్‌లో మేఘాంశ్ శ్రీహరి కొత్త లుక్‌లో కనిపించగా, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. షోయబ్ అందించిన విజువల్స్ ఆకట్టుకోగా, ప్రశాంత్ ఆర్. విహారి నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చింది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, అరబిక్ భాషల్లో కూడా ‘ఆస్మాన్’ను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. టీజర్‌కు వస్తున్న స్పందనతో మేఘాంశ్ కెరీర్‌లో ఈ చిత్రం మరో కీలక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.