Chiranjeevi: బాలయ్యకు పోటీగా చిరు.. లైఫ్ స్టోరీ మొత్తం..
ABN, Publish Date - May 24 , 2026 | 04:28 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డిజిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డిజిటిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. వెండితెరపై కోట్లమందిని అలరించి అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన త్వరలోనే ఓ ప్రతిష్ఠాత్మక ‘పోడ్ కాస్ట్’ ద్వారా డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ సరికొత్త టాక్ షో ద్వారా ఐదు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, తెరవెనుక రహస్యాలను చిరంజీవి షేర్ చేసుకోనున్నారని తెలిసింది.
ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ షోను సూపర్ హిట్ చేసిన ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి ఈ మెగా ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దనున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవి ఓ ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. జీరో నుంచి మొదలైౖ చిరంజీవి చేరుకున్న శిఖరాల వెనుక ఉన్న శ్రమను, ఆయన లైఫ్ జర్నీని రాబోయే తరాలకు స్ఫూర్తిగా అందించేలా ఈ షోను డిజైన్ చేస్తున్నట్లు బి.వి.ఎస్. రవి తెలిపారు. గతంలో మెగాస్టారు కుమార్తె సుష్మిత కొణిదెల సైతం ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. అయితే చిరంజీవితో పనిచేసిన పరిశ్రమ దిగ్గజాలు ఈ షోకి వస్తారా లేదా చిరు హిట్ సినిమాల వారీగా ఎపిసోడ్‌లను ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి మెగా 158 చిత్రంతో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.