విశ్వంభర.. వచ్చేది అప్పుడేనా
ABN, Publish Date - Oct 28 , 2026 | 06:52 PM
మెగాస్టార్ చిరంజీవి (Chirankeevi) హీరోగా, వశిష్ట దర్శకత్వంలో వస్తోన్న భారీ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం విశ్వంభర(Vishwambhara).
మెగాస్టార్ చిరంజీవి (Chirankeevi) హీరోగా, వశిష్ట దర్శకత్వంలో వస్తోన్న భారీ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం విశ్వంభర(Vishwambhara). ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై గత కొన్ని సంవత్సరాలుగా మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
మెగాస్టార్ నుంచి వస్తున్న సోషియో-ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాలు.. ఎన్నో రిలీజ్ డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొంతకాలంగా క్రిస్మస్ లేదా సంక్రాంతి మధ్య తీవ్ర ఊగిసలాట కొనసాగుతోన్న విషయం తెల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను సంక్రాంతి బరిలోనే దింపాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు లాక్ చేయడంతో, థియేట్రికల్ రిలీజ్ విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 13నే కచ్చితంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రెషర్ పెట్టడంతో సంక్రాంతి బరిలోనే విశ్వంభర ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇంకోపక్క డిసెంబర్ 4న కూడా విశ్వంభర వస్తుందనే ప్రచారం నడిచినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న బాక్సాఫీస్ ముందుకు తీసుకురావడమే పక్కా అని ఇండస్ట్రీ టాక్. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.