సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఇంట్లో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

ABN, Publish Date - Aug 24 , 2026 | 05:27 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే పావ్నా నివాసంలో చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ విక్రమ్ కాకడే తన ఇంట్లో ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్, చలమశెట్టి సునీల్, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చిరంజీవి పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే  చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒక ప్రాంతీయ హీరోగా కెరీర్ ప్రారంభించి.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి క్రేజ్‌కు ఇది మరో ఉదాహరణగా అభిమానులు చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బాబీ కొల్లి దర్శకత్వంలో 'కాకా" సినిమాలో నటిస్తున్నారు.  వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వంభర' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంలో ఉంది.  దీనితో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయబోతున్నారు. 

Updated Date - Aug 24 , 2026 | 05:31 PM