కాకా షూటింగ్ వీడియో లీక్ .. ఎవరీ కొత్త హీరో
ABN, Publish Date - Oct 19 , 2026 | 05:52 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం 'కాకా' (Kaaka). బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోండగా.. అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించనున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం 'కాకా' (Kaaka). బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోండగా.. అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుంచి చిరంజీవికి సంబంధించిన ఒక వీడియో లీక్ కాగా అదిసోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఈ వీడియోలో మెగాస్టార్ గెటప్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆటో జానీ గెటప్.. శంకర్ దాదా వాక్ తో చిరు అదరగొట్టేశారు. ఆయన వేసుకున్న గెటప్, బాడీ లాంగ్వేజ్ చూసి కొద్దిసేపు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియోను సడెన్‌గా చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు అసలు ఎవరీ కొత్త హీరో? అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ లీక్డ్ వీడియో తరువాత కాకా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిత్రంలోనూ తన మేకోవర్‌తో కొత్తదనం చూపించే మెగాస్టార్, ఈ చిత్రంలో మరింత యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుండటం విశేషం. కేవలం ఒక చిన్న లీకైన గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్‌తో జనవరి 13 న రాబోతున్న ఈ కాకా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.