మెగా మాస్ మూమెంట్.. 'ఇరుముడి' టీమ్‌కు చిరంజీవి, చరణ్ అభినందనలు!
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:09 PM
సినిమాలపై మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మంచి విజయం అందుకున్న ఏ సినిమా అయినా కూడా ఆ సినిమాని, ఆ చిత్ర బృందాన్ని అభినందించడం మెగాస్టార్ కు అలవాటుగా మారింది.
సినిమాలపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మంచి విజయం అందుకున్న ఏ సినిమా అయినా కూడా ఆ సినిమాని, ఆ చిత్ర బృందాన్ని అభినందించడం మెగాస్టార్ కు అలవాటుగా మారింది. అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడరు. తెలుగు ప్రేక్షకులను అలరించింది అని తెలియడం ఆలస్యం.. వారిపై ప్రశంసలు కురిపించేస్తారు. తాజాగా ఇరుముడి (Irumudi) చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇరుముడి చిత్రబృందాని ఇంటికి పిలిచి.. వారితో కొంత సమయాన్ని గడిపారు.
బాక్సాఫీస్ వద్ద ఇరుముడి సాధించిన గ్రాండ్ విజయంపై చిరంజీవి, రామ్ చరణ్ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. సినిమా కథాంశం, రవితేజ నటన, శివ నిర్వాణ టేకింగ్, సాంకేతిక బృందం చేసిన కృషిని వీరిద్దరూ ప్రత్యేకంగా ప్రశంసించారు. రవితేజతో చిరంజీవి, చరణ్‌లకు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. కాగా, ఈ సక్సెస్ మీట్‌లో వారంతా ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. చిత్ర యూనిట్‌కు ఈ విజయం మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని మెగాస్టార్ కొనియాడారు.
ఇక టాలీవుడ్ మాస్ ఐకాన్స్ అయిన చిరంజీవి, రామ్ చరణ్, రవితేజ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రాగానే నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ది మెగా మాస్ మూమెంట్ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోలను అధికారికంగా షేర్ చేశారు. మెగా కాంబినేషన్, మాస్ మహారాజాల బాండింగ్ చూసి టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరుముడి మూవీ థియేటర్లలో మాస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుండగా, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల నుంచి అందిన ఈ అభినందనలు చిత్ర యూనిట్‌కు కొండంత బలాన్ని ఇచ్చాయి.