సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మొన్న కోలీవుడ్.. నేడు మాలీవుడ్.. మెగాస్టార్ లైనప్ మామూలుగా లేదుగా

ABN, Publish Date - Nov 02 , 2026 | 03:50 PM

సాధారణంగా సీనియర్ హీరోలు.. 70 ఏళ్లు పైబడిన హీరోలు ఏడాదికో సినిమా చేస్తూ ఉంటారు. అది కూడా తమకు తగ్గ కథలను ఎంచుకొని, షూటింగ్ మొదలుపెట్టి అంతా అయ్యేసరికి ఏడాది అయిపోతుంది.

Megastar Chiranjeevi

సాధారణంగా సీనియర్ హీరోలు.. 70 ఏళ్లు పైబడిన హీరోలు ఏడాదికో సినిమా చేస్తూ ఉంటారు. అది కూడా తమకు తగ్గ కథలను ఎంచుకొని, షూటింగ్ మొదలుపెట్టి అంతా అయ్యేసరికి ఏడాది అయిపోతుంది. కానీ, అలా కాకుండా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఖైదీ నంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలని లైన్లో పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు చేతిలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా చిరు అన్ని భాషల డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా కుర్ర డైరెక్టర్లతో జత కట్టడం మరింత ఆశ్చర్యంగా కనిపిస్తుంది.


ఇప్పటికే విశ్వంభర రిలీజ్ కి సిద్ధమవుతోంది. కాకా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తరువాత శ్రీకాంత్ ఓదెలతో చేయాల్సిన సినిమా రద్దయినప్పటికీ, ఆయన మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ వైపు చూడకుండా వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథను చిరు విన్నట్లు సోషల్ మీడియాలో టాక్ రాగా, ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో కార్తీక్ సుబ్బరాజ్ ఈ విషయాన్ని స్వయంగా స్పష్టం చేశాడు. కథ చిరుకు నచ్చిందని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలెక్కనుందని కూడా తెలిపాడు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.


ఇక అందుతున్న సమాచారం ప్రకారం చిరు, ఒక మలయాళ డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. గత ఏడాది మోహన్ లాల్ హీరోగా తుడరుమ్ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి కూడా చిరంజీవికి ఒక క్రేజీ స్టోరీ వినిపించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. మోహన్ లాల్‌లోని సహజ నటనను, హీరోయిజాన్ని అద్భుతంగా పండించిన తరుణ్ మూర్తి కథకు చిరు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కుర్ర హీరోలే ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే.. సీనియర్ హీరో అయిన చిరు అన్ని భాషల డైరెక్టర్స్ ని లైన్లో పెట్టడంతో ఇండస్ట్రీ మొత్తం ఆయన లైనప్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఈ సినిమాలను మేకర్స్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

Updated Date - Nov 02 , 2026 | 03:50 PM