సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ డిజిటల్ డెబ్యూ.. టైటిల్ ఏంటో తెలుసా

ABN, Publish Date - Oct 25 , 2026 | 09:36 PM

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ అనే పదానికి నిలువెత్తు రూపం చిరంజీవి (Megastar Chiranjeevi). నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన రికార్డులు, తిరుగులేని మేనియా, టాలీవుడ్‌లో ఆయనకున్న రేంజ్, ఇమేజ్ వర్ణనాతీతం.

Chiranjeevi

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ అనే పదానికి నిలువెత్తు రూపం చిరంజీవి (Megastar Chiranjeevi). నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన రికార్డులు, తిరుగులేని మేనియా, టాలీవుడ్‌లో ఆయనకున్న రేంజ్, ఇమేజ్ వర్ణనాతీతం. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా, బాక్సాఫీస్ రికార్డులు మారుతున్నా.. మెగాస్టార్ రేంజ్, క్రేజ్ ఎప్పటికీ చెక్కుచెదరనివే. తన డాన్సులు, ఫైట్లు, అసమాన నటనా వైభవంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసి, టాలీవుడ్ సుప్రీమ్ హీరోగా చెలమణి అవుతున్నారు.


ఇక వెండితెరపై హీరోలుగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఎందరో స్టార్ హీరోలు.. బుల్లితెరపై, ఓటీటీలలో హోస్ట్‌లుగా మారి ప్రేక్షకులను అలరించడం మనం చూస్తూనే ఉన్నాం. నాగార్జున, ఎన్టీఆర్, రానా, నాని, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులు హోస్ట్‌లుగా మారి తమదైన శైలిలో షోలను నడిపిస్తూ అదరగొట్టారు. ఇప్పుడు అదే బాటలో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సరికొత్త డిజిటల్ అవతారంలో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన ఒక ప్రత్యేకమైన టాక్ షో ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు మెగావర్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది.


సాధారణ ఇంటర్వ్యూల శైలికి భిన్నంగా, నేరుగా వీక్షకులతో వివిధ రంగాల సెలబ్రిటీ అతిథులతో ముచ్చటించేలా ఈ టాక్ షో డిజైన్ చేయబడింది. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన చిరంజీవి.. ఈ షో ద్వారా తన వ్యక్తిగత జీవితం, సినీ రంగానికి సంబంధించిన తెరవెనుక నిజాలు, రాజకీయ ప్రయాణం, ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోనున్నారు. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. మరి ఈ షోతో చిరు ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Oct 25 , 2026 | 09:37 PM