సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ముఠా మేస్త్రి' మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడు.. 4k ట్రైల‌ర్ అదిరింది

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:43 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలు కానుంది.

Muta Mestri

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలు కానుంది. చిరంజీవి కెరీర్‌లో మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ‘ముఠామేస్త్రీ’ (muta mestri) ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్‌లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముఠామేస్త్రీ’ 1993లో జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ చిత్రంలో కూలీ నాయకుడిగా మెగాస్టార్ చేసిన పాత్ర, ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించ‌గా రాజ్-కోటి సంగీతం అప్పట్లో విశేషంగా ఆదరణ పొందింది. పాటల్లో చిరంజీవి డ్యాన్స్, ఆయన ఎనర్జీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్ప‌టికీ ప్ర‌తి ఇంట్లో వినిపిస్తూనే ఉంటుందంటే పాటకు క్రేజ్‌ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా 4K వెర్షన్‌ను సిద్ధం చేశారు. 

ఇదిలాఉంటే.. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ 'ముఠా మేస్త్రి' చిత్రాన్ని చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 21న విడుదల చేయాలని భావించారు. అయితే అనుకున్న విధంగా ఫైనల్ 4కె అవుట్ పుట్ అందకపోవడంతో ఈ సినిమా రీ-రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన 'ముఠామేస్త్రి' రీ-రిలీజ్‌ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ తేదిని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. సినిమాను న‌వంబ‌ర్ 22న థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

Updated Date - Nov 18 , 2026 | 01:43 PM