అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే
ABN, Publish Date - Jul 24 , 2026 | 08:11 PM
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త నటులను, ప్రతిభావంతులైన కళాకారులను ఆదరించడంలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. రీసెంట్‌గా ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త నటులను, ప్రతిభావంతులైన కళాకారులను ఆదరించడంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముందు వరుసలో ఉంటారు. రీసెంట్‌గా ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దర్శకుడు బాబీ (Bobby) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘Mega158’. ఈ సినిమాలో తన అల్లుడు, ప్రముఖ హాస్యనటుడు డాక్టర్ భద్రం (Dr Bhadram)కు ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించినందుకు సోము వీర్రాజు (Somu Veerraju) ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విషయమై చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి, ఆయన చూపిన అభిమానానికి సోము వీర్రాజు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమంది నూతన కళాకారులకు భరోసానిస్తూ, కళను, నటీనటులను నిరంతరం ప్రోత్సహించే చిరంజీవి విశాల హృదయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సోము వీర్రాజు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘Mega158’ పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కమెడియన్ డాక్టర్ భద్రంకు ఒక మంచి రోల్ దక్కడం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే ఈ మంచి అవకాశం డాక్టర్ భద్రం నటనకు కొత్త గమ్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కమెడియన్‌గా భద్రం మంచి గుర్తింపునే పొంది ఉన్నారు. మరీ ముఖ్యంగా సాయి దుర్గ తేజ్, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ చిత్రంలోని భద్రం నటనకు నవ్వుకోని వారు లేరంటే నమ్మాలి.
ఇవి కూడా చదవండి:
‘కపాలి’గా రోహిత్ నారా.. ఫస్ట్ లుక్ అదిరింది
రేర్ కాంబోతో మణిరత్నం లవ్ స్టోరీ.. ఇక ఊహించుకోండి
‘జయం’లో ఛాన్స్.. పార్టీ చేసుకున్న బన్నీ.. తీరా చూస్తే!