Chiranjevvi: అనీల్‌కు.. చిరు లగ్జరీ రేంజ్ రోవర్ గిఫ్ట్!
ABN, Publish Date - Jan 25 , 2026 | 09:42 PM
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ విజయంవంతం అయిన సందర్భంగా చిరంజీవి దర్శకుడు అనీల్ రావిపూడికి లగ్జరీ రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేశారు.
సంక్రాంతి పండుగకు థియేటర్లకు వచ్చి రికార్డుల మోత మోగిస్తోంది చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవలే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించుకుని ఇంకా అప్రతిహాతంగా దూసుకెళుతోంది.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనీల్‌కు సుమారు 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ (Range rover ) కారును బహుమతిగా అందజేశారు. ఇంతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతరం ఈ చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.