సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టారే

ABN, Publish Date - Aug 22 , 2026 | 08:11 AM

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది.

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్‌డే (HBD Chiranjeevi) ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. పైగా సక్సెస్ రూటులో సాగుతోన్న మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు మరింత ఆనందం పంచుతున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తను మెగాస్టారే అనేలా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు సైతం షాకిస్తున్నారు.

ఏడు పదులు దాటిన తర్వాత హీరోలకు స్టార్ డమ్ తగ్గుతుందంటారు. డెబ్బై ఏళ్ళ వయసులోనూ స్టార్‌గా సక్సెస్ చూసిన వారు అరుదుగానే ఉన్నారు... అలాంటి జాబితాలో చిరంజీవి సైతం చేరారు. ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో టాప్ హిట్‌గా నిలచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఆ ఫీట్ సాధించారు చిరంజీవి. ఇప్పటి వరకు 70 ఏళ్ళవయసులోనూ టైటిల్ రోల్స్‌తో బంపర్ హిట్స్ చూసిన వారిలో యన్టీఆర్, రజనీకాంత్ ఉన్నారు.. ఇప్పుడు చిరంజీవి కూడా వారి సరసన చేరారు. అదే ఫ్యాన్స్‌కు అమితానందం పంచుతోంది.


‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి మరో విశేషాన్నీ సొంతం చేసుకున్నారు. ఆయన రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో సినిమాలకు అంకితమైన తర్వాత మూడు బంపర్ హిట్స్ చూశారు. ఆ మూడు చిత్రాలు సంక్రాంతి సంబరాల్లోనే పాలుపంచుకోవడం విశేషం. 2017లో ‘ఖైదీ నంబర్ 150’, 2023లో ‘వాల్తేరు వీరయ్య’, ఈ యేడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇలా సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాలతో చిరు బంపర్ హిట్స్ అందుకున్నారు. ఒకప్పుడు మెగాస్టార్‌గా ఆయన రాజ్యమేలుతున్న సమయంలోనూ వరుసగా సంక్రాంతి సక్సెస్ తో ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పుడు అలా వరుస సంవత్సరాల్లో కాకపోయినా, వరుసగా పొంగల్‌కు రిలీజ్ చేసిన సినిమాలతో గ్రాండ్ సక్సెస్ చూశారు చిరంజీవి. అది కూడా విశేషంగా మారింది.. అందుకే చిరు ఫ్యాన్స్ ఆనందం అంబరమంటుతోందని చెప్పొచ్చు.


చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం దసరా కానుకగా వస్తుందని వినిపిస్తోంది. వీఎఫ్ఎక్స్‌లో పర్ఫెక్షన్ కోసం ‘విశ్వంభర’ ఆలస్యమవుతూ వస్తోంది. అయితేనేం.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా ‘విశ్వంభర’ అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక చిరంజీవితో బాబీ రూపొందిస్తోన్న రెండో చిత్రానికి పలు పేర్లు టైటిల్స్‌గా వినిపిస్తున్నాయి. ఆ టైటిల్ అనౌన్స్‌మెంట్ చిరంజీవి బర్త్ డే స్పెషల్‌‌గా కాసేపట్లో రివీల్ కాబోతోంది. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో బంపర్ హిట్ చూసిన చిరంజీవి, బాబీ కాంబోలో రాబోయే సినిమా కూడా అదే తీరున అలరిస్తుందని అభిమానుల అభిలాష. పైగా ఆ మూవీ సైతం పొంగల్‌కే రిలీజ్ కానుంది. మరి ఏ టైటిల్‌తో చిరు-బాబీ సినిమా వస్తుందో?.. రాబోయే చిత్రాలతో చిరంజీవి ఏ లాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈలోపు మెగాస్టార్‌.. ఇలాంటి మరిన్ని బర్త్‌డేలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్’ అని చెప్పేద్దాం.

ఇవి కూడా చదవండి:

బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నటి రాధిక.. ఇదేందయ్యా ఇది

మెగా బ్లాస్ట్‌కు సిద్ధమవ్వండి.. డైరెక్టర్ బాబీ పోస్ట్ వైరల్

‘మాన్‌స్టర్’గా సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి స్కెచ్ ఏంటో

Updated Date - Aug 22 , 2026 | 08:11 AM