సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

ABN, Publish Date - May 22 , 2026 | 09:11 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రెండోసారి రూపుదిద్దుకుంటోన్న ‘మెగా158’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ‘స్పిరిట్ ఆఫ్ ది మెగా158’ వీడియోను వదిలారు.

Bobby and Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో రెండోసారి రూపుదిద్దుకుంటోన్న ‘మెగా158’ (Mega158) చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో మెగాభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. గురువారం హైదరాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మేకర్స్ ప్రకటించినట్లుగానే నేడు (శుక్రవారం) హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ సన్నివేశాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.


మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా.. తాజాగా చిత్రబృందం బీటీఎస్ వీడియోను విడుదల చేసింది. ఇందులో సినిమా ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు. వీడియోలో ఉత్సాహంగా కనిపించిన చిరంజీవి, ‘లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్’ అంటూ క్లాప్ టైమ్‌లో చెప్పిన డైలాగ్‌ని వినిపించారు. అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగగా, అన్నయ్యా.. కేవలం పూజా కార్యక్రమాలే జరిగాయి అంటూ.. లీక్ చేయవద్దని కోరాడు. దీనికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ.. ‘సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తా.. అంత వరకు వెయిట్ చేయండి’ అంటూ చమత్కరించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది.


ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోకి కెవిఎన్ ప్రొడక్షన్స్, నిర్మాత వెంకట్ కె నారాయణకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి మెగా158 చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాబీ నాయకత్వంలోని మా అద్భుతమైన బృందంతో కలిసి ఈ రోజు నుంచే షూటింగ్‌ను ప్రారంభించాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Updated Date - May 22 , 2026 | 09:14 PM