Ram Charan: పెద్ది విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను
ABN, Publish Date - Jun 08 , 2026 | 05:54 PM
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది(Peddi) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధిస్తోంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది(Peddi) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 4 రోజుల్లో 292 కోట్లు కొల్లగట్టి.. చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా పెద్ది థాంక్స్ మీట్ ని మేకర్స్ నిర్వహించారు.
పెద్ది థాంక్స్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. అభిమానులకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. 'మనస్ఫూర్తిగా థ్యాంకు చెప్పటానికి ఈ ఈవెంట్ కు వచ్చాను. నాకు తెలిసిన పని చేస్తూ ఇంతప్రేమను పొందడం అనేది నాకు అర్ధం కావడం లేదు. ఎవరో ఒకరు వచ్చి నన్ను పుష్ చేసి ఈ పని చెయ్ అని చెప్పలేదు. నేను స్వతహాగా బుచ్చి అనే డైరెక్టర్ ని కలిసి.. కథ నచ్చి, కష్టపడి చేసిన సినిమా. పెద్ది విషయంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాను.
మొదటిసారి ప్రసాద్ థియేటర్ లో కామ్ గా ఉంటుందని వెళ్ళాను. అక్కడ కూడా శ్రీరాములు రేంజ్ రెస్పాన్స్ ఉంది. నా కెరీర్ లో నెంబర్ వన్ ఆర్ టూ గా నిలిచే సినిమా ఇచ్చిన బుచ్చిబాబుకు థాంక్స్. మా ఎఫర్ట్ ను గుర్తించి పెద్ది చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. మనసుపెట్టి పనిచేస్తే.. అది ఎలాంటి సినిమా అయినా హిట్ అయ్యి తీరుతుంది. మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ మీడియానే.. మీడియా ఫ్రెండ్స్ కు ధన్యవాదాలు.. జగపతిబాబు ఇన్స్ స్పైరింగ్ పాత్రలో నటించారు. సెకండాఫ్ విషయంలో కొంత టెన్షన్ పడ్టాము. రెహ్మాన్ తన వర్క్ తో ఎక్కడికో తీసుకువెళ్ళారు. ఇక 185 రోజులు ఈ సినిమా చేస్తే 165 రోజులు మాతో ఉండి మమ్మల్ని ఎంతో బాగా చేసుకొన్న నిర్మాత సతీష్ కిలారుకి థాంక్స్. పెద్ది టీమ్ సిన్సియర్ గా వర్క్ చేశారు అందరికీ ధన్యవాదాలు' అంతో తెలిపాడు.