సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగా కోడలిపై ట్రోలింగ్.. సిగ్గు లేదా అంటున్న ఫ్యాన్స్

ABN, Publish Date - Jul 26 , 2026 | 06:43 PM

సాధారణంగా ఏ మహిళ అయినా తల్లి అయిన తర్వాత శరీరంలో అనేక మార్పులు రావడం, బరువు పెరగడం అత్యంత సహజం. మాతృత్వంతో వచ్చే హార్మోనల్ మార్పులకు స్టార్ హీరోయిన్లు కూడా అతీతులేమీ కారు.

Lavanya Tripathi

సాధారణంగా ఏ మహిళ అయినా తల్లి అయిన తర్వాత శరీరంలో అనేక మార్పులు రావడం, బరువు పెరగడం అత్యంత సహజం. మాతృత్వంతో వచ్చే హార్మోనల్ మార్పులకు స్టార్ హీరోయిన్లు కూడా అతీతులేమీ కారు. గతంలో ఐశ్వర్యా రాయ్, కాజల్ వంటి ఎంతోమంది అగ్ర కథానాయికలు ప్రసవం తర్వాత బరువు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొన్న లావణ్య.. గతేడాది సెప్టెంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వాయువ్ తేజ్ అని నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ. ఇక లావణ్య..ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తుంది. సతీ లీలావతి సినిమా తరువాత లావణ్య సినిమాలకు కొంచెం దూరమైంది. ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి కాస్త బరువు పెరిగి కనిపించింది. ఇక ఆమె బరువు పెరిగి కనిపించడంతో కొంతమంది దారుణమైన బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు. బాగా బరువు పెరిగిందని, ఆంటీ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.


ఒక తల్లిని చూసి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మెగా అభిమానులు తీవ్రంగా మండపడుతున్నారు. డెలివరీ తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావడం కామన్. ఒక తల్లిని, ఆమె శరీర ఆకృతిని చూసి అలా అనడానికి అసలు సిగ్గు లేదా? అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నటీమణులైనా, సాధారణ మహిళలైనా ప్రసవానంతరం కోలుకోవడానికి సమయం పడుతుందని, బాడీ షేమింగ్ సంస్కృతిని ఆపాలని కోరారు. ప్రస్తుతం లావణ్యకు మద్దతుగా వస్తున్న ఈ కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Updated Date - Jul 26 , 2026 | 07:06 PM