మీనా: ఆ సమయంలో అమ్మ మాటలు ధైౖౖర్యం ఇచ్చాయి..

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:43 PM

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మీనా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా బిజీగానే ఉన్నారు. దృశ్యం సిరీస్‌ సినిమాలతో పాటు ఇతర చిత్రాలతోనూ తెరపై కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు డిజిటల్‌ బాట కూడా పట్టారు.

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మీనా (Meena) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా బిజీగానే ఉన్నారు. దృశ్యం సిరీస్‌ సినిమాలతో పాటు ఇతర చిత్రాలతోనూ తెరపై కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు డిజిటల్‌ బాట కూడా పట్టారు. ఓటీటీ సిరీస్‌లు చేయడానికి కూడా ఆమె రెడీ అయ్యారు. ఆమె 2019లోనే తమిళంలో ‘కరోలిన్‌ కామాక్షి’ అనే సిరీస్‌ చేశారు. ఇప్పుడు మలయాళ భాషల్లో ‘సీక్రెట్‌ స్టోరీస్‌: రోస్లిన్‌’ (Secret Stories: Roselin) సిరీస్‌లో నటిస్తున్నారు. ఆమెతోపాటు వినీత్‌ ఇందులో కీలక పాత్రధారి. ఇది ఫిబ్రవరి 27 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా తన వ్యక్తిగత, వృత్తి సంబంధిత విషయాల గురించి మాట్లాడారు.  

‘ఒకప్పుడు వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండేదాన్ని. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడానికి తీరిక దొరికేది కాదు. పండుగల సమయంలో కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు. నాకెంతో ఇష్టమైన దీపావళి పండుగను కూడా మిస్‌ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో బాధపడ్డాను. ఆ సమయంలో అమ్మ చెప్పిన మాటలు నాకు ఎంతో ధైౖర్యం ఇచ్చాయి. ‘పండగలను అందరూ చేసుకుంటారు. కానీ కొత్త దర్శకులు, కొత్త కళాకారులతో కలిసి పని చేసే అవకాశాలు కొద్దిమందికే వస్తాయి. వాటిని కాదనుకోకూడదు' అని అమ్మ చెప్పిన మాటలు నా దృష్ణి కోణాన్ని మార్చాయి. అప్పటి నుంచి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాను. ఈ సిరీస్‌లో నేను తల్లి పాత్ర పోషించాను. ఈ పాత్ర భావోద్వేగపరంగా నాకు మరింత దగ్గరైంది. ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగ్‌ నా మనసుకి తాకింది. ఒకప్పుడు మనం పెరిగిన తరం, ఇప్పుడు పెరుగుతున్న తరానికి చాలా తేడా ఉంది. ఇప్పటి పిల్లలకు అవగాహన ఎక్కువ. వారికి అన్నీ తెలుసు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది వారికి చెప్పడం వరకే మన బాధ్యత’ అని అన్నారు. 

Updated Date - Feb 21 , 2026 | 03:32 PM