వారణాసి గ్లింప్స్.. మహేష్ ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా
ABN, Publish Date - Jul 18 , 2026 | 06:53 PM
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS. Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi).
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS. Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో మహేష్ బాబు ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టేలా జక్కన్న అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను ప్లాన్ చేస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సంబంధించిన కొన్ని క్రేజీ ఫొటోలను విడుదల చేసింది. ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక అంటూ డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్, ఆ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఫొటోస్ బయటకు రావడంతో ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ సర్‌ప్రైజ్ అప్‌డేట్ తర్వాత వచ్చే నెల ఆగస్టు 9న రాబోయే మహేశ్ బాబు బర్త్‌డే అప్‌డేట్‌పై అందరి కళ్లూ పడ్డాయి.
ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా వారణాసి చిత్రానికి సంబంధించిన తొలి పవర్‌ఫుల్ విజువల్ లేదా వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్ బ్లాస్ట్ అయ్యే రేంజ్‌లో ఈ గ్లింప్స్ లోడింగ్ కాబోతోందని, ఈ బర్త్ డే నుంచే ప్రమోషన్లను లార్జ్ స్కేల్‌లో మొదలు పెట్టడానికి జక్కన్న టీమ్ సన్నాహాలు చేస్తోందని ఇండస్ట్రీ టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.