అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు సాయిపల్లవి.. ఏం క్రేజ్ రా బాబు
ABN, Publish Date - Oct 16 , 2026 | 08:47 PM
సౌత్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి కానీ, ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సౌత్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి కానీ, ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అందాల అరబోత లేకుండా పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి తాజాగా ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే హీరోల్లో ఆ రికార్డ్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బద్దలుకొట్టగా.. హీరోయిన్స్ లో సాయిపల్లవి ఆ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
అసలు ఆ రికార్డ్ ఏంటంటే.. సాయిపల్లవి మొట్ట మొదటిసారి తెలుగులో ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చింది. ఇప్పటికే సాయిపల్లవికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ వస్తున్నాయి. జీ5 లో ఈ ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోల్లో సాయి పల్లవి లైట్ పింక్ అవుట్ఫిట్లో ఎంతో అందంగా, చిరునవ్వుతో కనిపించింది. రంగులద్దిన స్టూడియోలో ఆమె నవ్వులు చిందిస్తున్న ఈ ప్రోమోలు విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి స్పందనను రాబట్టాయి. ఒక్కసారిగా భారీ ట్రఫిక్ పెరగడంతో జీ5 సర్వర్లు సైతం క్రాష్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఇంటర్వ్యూకి ఇలా జరగలేదు.
గతంలో ప్రభాస్.. ఆహాలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ షోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే సర్వర్లు క్రాష్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ షోలో ప్రభాస్- గోపీచంద్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రభాస్ తరువాత ఆ రేంజ్ రికార్డ్ ని సాయిపల్లవి క్రియేట్ చేసింది. ఇది కేవలం ప్రోమోల వరకేనా.. ఈ సండే ఎపిసోడ్ కి కూడా ఇలానే జరుగుతుందా అనేది చూడాలి. ఇక ఈ వార్త విని నెటిజన్స్ ఏం క్రేజ్ రా బాబు వీళ్లది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్లో విడుదల కానున్న ఆమె సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఈ టాక్ షో ద్వారా ఆమె తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ జర్నీ గురించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఈ షో కోసం గంటలు లెక్కపెడుతూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.