సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: 'పెద్ది' మస్సా మస్సా.. లిరికల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

ABN, Publish Date - Jun 02 , 2026 | 10:34 AM

రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందిన స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా చిత్రం పెద్ది నుంచి మసా మ‌సా లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

peddi

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో రూపొందిన స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా చిత్రం పెద్ది (Peddi). ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి వ‌చ్చిన పాట‌ల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సినిమా నుంచి థీమ్ సాంగ్ మసా మ‌సా (Massa Massa Lyrical Video) అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు అనంత శ్రీరామ్ (Anantha Sri Ram) సాహిత్యం అందించ‌గా రెహ‌మాన్ (A. R. Rahman) సంగీతంలో విషాల్ మిశ్రా (Vishal Mishra) ఆల‌పించాడు.

అయితే.. ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అయిన తీరును, చ‌ర‌ణ్ ప‌డిన క‌ష్టాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. పాట‌లోని సాహిత్యం సైతం ఆలోచింప‌చేసేలా ఉంది. ఈ పాంగ్ రిలీజ్ అయి త‌క్కువ స‌మ‌యంలోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.

Updated Date - Jun 02 , 2026 | 10:34 AM