Sumathi Sathakam: అమ‌ర్‌దీప్‌కు.. మాస్ మ‌హారాజ సాయం

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:28 PM

బిగ్‌బాస్ అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary), శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం సుమ‌తీ శ‌త‌కం

Sumathi Sathakam:

బిగ్‌బాస్ అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary), శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం సుమ‌తీ శ‌త‌కం (Sumathi Sathakam). ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వ‌హించ‌గా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Distributors LLP) తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుండ‌డంతో ఒక్క‌సారిగా మూవీపై హైప్ పెరిగింది.

సీరియల్స్, బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన అమర్‌దీప్ చౌదరి మాస్ మహారాజా రవితేజ (Raviteja) కు అభిమానిగా అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన రవితేజ మాట్లాడుతూ.. “అమర్దీప్, ‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్ చూశాను. కంటెంట్ చాలా బాగా నచ్చింది. సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు మరింత వెలుగొందాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్ప‌టికే.. రాయలసీమ ప్రాంతంలో నిర్వహించిన ప్రమోషన్స్ టూర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, తిరుపతిలోని ఓ కాలేజీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే.. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ‘సుమతీ శతకం’ ఈ చిత్రానికి జీరో కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్ లభించగా సెన్సార్ సభ్యుల నుంచి సైతం ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని, ఓవర్సీస్‌లో నార్త్ అమెరికాలో వైబ్రెంట్ సినిమాస్, అమెరికాలో డల్లాస్‌లో రవి కొల్లిపార, జై పాకాల విడుదల చేయనున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 06:35 PM