Irumudi: వచ్చేసింది.. వచ్చేసింది.. మల్లెపూల పల్లకి.. వచ్చేసింది

ABN , Publish Date - Aug 16 , 2026 | 08:30 PM

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇరుముడి.

Irumudi

మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇరుముడి (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిమిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ప్రేక్షకులందరూ ఎదురుచూస్తోన్న మల్లెపూల పల్లకి (Mallepoola Pallaki) లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.


సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పవర్‌ఫుల్ అండ్ డివోషనల్ మాస్ ట్రాక్‌ను డప్పు శ్రీను ఎంతో ఆవేశంగా, శ్రావ్యంగా ఆలపించాడు. అయ్యప్ప పూజలో ఈ సాంగ్ లేకుండా ఉండదు. ఈ సాంగ్ వింటేనే ఏదో తెలియని ఒక ఆధ్యాత్మికత వచ్చేస్తోంది. చౌడం శ్రీనివాసరావు (వాసు) అందించిన సాహిత్యం పాట స్థాయిని పెంచగా, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అందించిన జానపద.. భక్తి శైలి స్టెప్పులకు రవితేజ తనదైన శైలి మాస్ గ్రేస్‌తో ప్రాణం పోశాడు. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ అవుతూ వ్యూస్ రాబడుతోంది.


ఎక్కడా ఏ చిన్న తేడా రాకుండా యూట్యూబ్ లో పాడిన సింగర్ డప్పు శ్రీనుతోనే ఈ సాంగ్ ను పాడించడంతో మరింత శ్రావ్యంగా వినిపిస్తోంది. ఈ ఒక్క సాంగ్ తో థియేటర్ లు అన్నీ అయ్యప్ప ఆలయాలుగా మారిపోతాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మొదటి నుంచి కూడా ప్రేక్షకులు ఇరుముడిపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మరి ఈసారి రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 16 , 2026 | 08:34 PM