Marokkasari:ప్రపంచంలోనే అత్యంత ఎత్తు సరస్సులో.. చిత్రీకరించిన సినిమా
ABN, Publish Date - Jan 22 , 2026 | 08:28 AM
నరేష్ అగస్త్య, సంజనా సారథి నటీనటులుగా సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మరొక్కసారి’.
నరేష్ అగస్త్య(Naresh Agastya), సంజనా సారథి (Sanjana Sarathi) నటీనటులుగా సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మరొక్కసారి’ (marokkasari). నితిన్ లింగుట్ల దర్శతక్వం ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్ సరిహద్దులను దాటి 'మరొక్కసారి' చిత్ర బృందం ఛాలెంజింగ్‌గా రూపొందించారు. కేరళలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాల నడుమ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. టిబెట్ సరిహద్దుకు దగ్గరలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో.. గురుడోంగ్మార్ సరస్సు (Gurudongmar Lake) వద్ద కూడా ఈ సినిమా షూటింగ్ చేశారు.
'సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా ‘మరొక్కసారి’ నిలిచింది. కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. తక్కువ ఆక్సిజన్ స్థాయి, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే సమయంలో నటీనటులు సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ మొత్తం షెడ్యూల్ అంతా నటీనటులు, టెక్నికల్ టీమ్ ఆరోగ్యం, భద్రత, మానసిక ఉత్సాహానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొడక్షన్ హెడ్ అనుదీప్ పడూరు ఎంతో ప్రశంసనీయమైన పాత్ర పోషించటంతో కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు.