సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని తెలిపే గీతం...

ABN, Publish Date - Feb 28 , 2026 | 02:11 PM

'హుషార్ పిట్టలు' చిత్రం నుండి 'మంగళ స్నానం' సాంగ్ విడుదలైంది. అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన ఈ సినిమాను ఏషియన్ సురేశ్‌ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేయబోతోంది.

Husharu Pittalu Movie

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషార్ పిట్టలు' (Husharu Pittalu). వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ (Asian Suresh Films) ద్వారా త్వరలో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చిందని, తాజాగా ఈ సినిమాలోని హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ సాంగ్ 'మంగళస్నానం'ను విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.


ఓ తండ్రి తన కూతురును ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో గీత రచయిత ఎస్.ఎస్. చిరంజన్ తెలియచేశారు. తండ్రి కూతుళ్ల అనుబంధంతో సాగే ఈ పాటను యోగి సురేష్‌, విహా ఆలపించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతాన్ని అందించారు. ఈ సందర్బంగా దర్శకుడు బిక్షు మాట్లాడుతూ 'తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం తెలియజేసే పాట ఇది. ఇది యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం అవుతుంది. నా జీవితంలోనూ, నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.


నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ 'ఈ సినిమా ఫస్టాఫ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్ తోనూ, సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌ కంటెంట్‌తోనూ ఉంటుంది. ఇది డెఫినెండ్‌గా మంచి సినిమా. ఈ మూవీ ద్వారా నేటి యువతకు, తల్లిదండ్రులకు దర్శకుడు ఓ మంచి విషయం చెబుతున్నాడు. ఈ సినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్సబుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో చూపించాం. ఆర్టిస్టుల నటన ఎంతో సహజంగా ఉంటుంది' అని అన్నారు. ఈ చిత్రంలో గోవర్థన్‌, సునీత్‌ మనోహర్‌, రమేష్‌, బలగం బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Updated Date - Feb 28 , 2026 | 02:16 PM