‘సాట్టపులి’గా సుహాస్.. ‘మండాడి’ మేకింగ్ వీడియో చూశారా!

ABN , Publish Date - Jun 26 , 2026 | 09:11 PM

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మండాడి’ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Suhas in Mandaadi

సుహాస్ (Suhas), సూరి (Soori) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మండాడి’ (Mandaadi) చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారనే విషయాన్ని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తెలియజేశాయి. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


తాజాగా ఈ మూవీని సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు వావ్ అనే రేంజ్‌లో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక కత్తి పట్టుకుని రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అలా నడుచుకుంటూ వస్తుంటే.. థియేటర్లో విజిల్స్ పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో ‘సాట్ట పులి’గా సుహాస్ (Suhas as Saattapuli) నెవ్వర్ బిఫోర్ అనే పాత్రలో మెప్పించబోతోన్నారనేది ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. అలాగే సుహాస్, సూరి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని అంటున్నారు.


మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమా విడుదల లోపు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర నిర్మాతలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘జననాయగన్‌’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!

సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

జక్కన్న షాక్‌ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు

Updated Date - Jun 26 , 2026 | 09:11 PM