David Reddy: వారెవ్వ ఏమి లుక్కు...
ABN, Publish Date - Jan 26 , 2026 | 05:11 PM
మంచు మనోజ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'డేవిడ్ రెడ్డి' మూవీ నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. దేశ స్వాతంత్ర సమరానికి చెందిన కథతో ఈ సినిమాను హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తున్న కొత్త సినిమా 'డేవిడ్ రెడ్డి' (David Reddy). ఈ సినిమాను వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా 'డేవిడ్ రెడ్డి' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క (Maria Ryaboshapka) హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని 'డేవిడ్ రెడ్డి' లోని మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
మంచు మనోజ్ ఈ మూవీలోని తన పాత్ర గురించి మాట్లాడుతూ, 'డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండు డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు. ఇది 1897 - 1922 మధ్య జరిగే కథ. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూస్తారు' అని మనోజ్ తెలిపాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, 'నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే పాత్ర. ఎంతో క్రూరమైన, క్షమాగుణం లేనిది' అని పేర్కొన్నారు. పార్తీబన్, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.