సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంచు మనోజ్‌: పాత ఐఫోన్‌కి 17 కవర్‌ వేసి వాడుతున్నా..

ABN, Publish Date - Feb 28 , 2026 | 06:35 PM

గొప్పకోసమో, ఒకరి మెప్పు కోసం అప్పులు చేయవద్దని హీరో మంచు మనోజ్‌ అన్నారు. గీతమ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ వేడుకలో ఆయన పాల్గొన్నారు.

Manchu Manoj

గొప్పకోసమో, ఒకరి మెప్పు కోసం అప్పులు చేయవద్దని హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) అన్నారు. గీతమ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. అదిరిపోయే సందేశాన్నిచ్చారు. ‘ఒకరి ముందు గొప్పగా కనిపించడానికి అప్పులు చేయవద్దు. గౌరవం అనేది మనం చేసే పనిని బట్టి వస్తుంది. నిన్న ఏం చేశాం.. ఈ రోజు ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే లైఫ్‌ అంతా బావుంటుంది. నేను గొప్పలకి పోను.. నా పాత ఐఫోన్‌కు, కొత్తగా వచ్చిన ఐఫోన్‌ 17 కవర్‌ వేసి వాడుతున్నాను. ఇతరుల మెప్పుకోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలి’ అని యువతకు సూచించారు. మిరాయ్‌లో కీలక పాత్ర పోషించిన మెప్పించిన ఆయన ఇప్పుడు ‘వాట్‌ ద ఫిష్‌’ అనే చిత్రం చేస్తున్నారు. 

Updated Date - Feb 28 , 2026 | 07:19 PM