Mana Shankara VaraPrasad Garu: బాక్సాఫీస్ బద్దలు కొట్టేసారు
ABN, Publish Date - Jan 13 , 2026 | 02:15 PM
‘పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..’ అంటూ మాటలే కాదు.. పాటలతోనూ చెప్పారు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర బృందం.
‘పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..’ అంటూ మాటలే కాదు.. పాటలతోనూ చెప్పారు ‘మన శంకరవరప్రసాద్ గారు’ (ManaShankaraVaraPrasadGaru) చిత్ర బృందం. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు చక్కని టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లపై అందరూ దృష్టిపెట్టారు. తొలి రోజు కలెక్షన్లను నిర్మాణ సంస్థ ప్రకటించింది. ప్రీమియర్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.84 కోట్లు వసూలు చేసినట్లు షైన్ స్క్రీన్స్ సంస్థ వెల్లడించింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేశారంటూ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో వెంకీ గౌడగా విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. (ManaShankaraVaraPrasadGaru collections)
కధేమిటంటే...
సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మ (శరత్ సక్సేనా) పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంటాడు శంకర వర ప్రసాద్ (చిరంజీవి). పైకి ఆనందంగా కనిపించే అతని జీవితంలో విషాదం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్, బిజినెస్ మాగ్నెట్ కూతురు శశిరేఖ (నయనతార Nayantara ) ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత శశిరేఖ తండ్రి జీవీఆర్ (సచిన్ ఖేడేకర్) పన్నాగం కారణంగా వారు విడాకులూ తీసుకుంటారు. దూరమైన తన భార్యకు దగ్గర కావడం కోసం వర ప్రసాద్ ఏం చేశాడు? తన మీద విషం నూరిపోసిన పిల్లల మనసుల్ని ఎలా గెలచుకున్నాడు? మావగారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ.