సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెద్దిలో.. మానస వారణాసి మాస్ మసాలా స్పెషల్ సాంగ్! వర్కౌట్ అవుతుందా?

ABN, Publish Date - Apr 09 , 2026 | 07:32 AM

పెద్ది విడుదల తేదీపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ, చిత్రంలోని స్పెషల్ సాంగ్ గురించి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Peddi

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది (Peddi) చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా రిలీజ్ మ‌రోసారి వాయిదా పడనుందనే వార్త వారిని కాస్త నిరాశకు గురి చేస్తోంది. ముందుగా చిత్ర యూనిట్ ప్రకటించిన విడుదల తేదీ ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. నిర్మాణానంతర పనుల్లో జాప్యం లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ సైతం పెద్ది చెప్పిన టైమ్ కే వస్తుందని అన్నాడు. అయినప్పటికీ పెద్ది విడుదల తేదీ విషయంలో అభిమానులకు క్లారిటీ లేకుండా పోయింది.

ఈ సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ, చిత్రంలోని స్పెషల్ సాంగ్ గురించి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాస్ మసాలా సాంగ్‌లో మెరవబోయే నటి ఎవరనే దానిపై కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇటీవల కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly)సినిమాతో యువతను ఆకట్టుకున్న నటి మానస వారణాసి (Manasa Varanasi)ని ఈ పాట కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ లాంటి గ్రేట్ డ్యాన్సర్‌తో కలిసి స్టెప్పులేయడం అంటే అది ఏ నటికైనా అరుదైన అవకాశమే అని చెప్పాలి.

కానీ మానస వారణాసి ఎంపికపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మానస అంటే ఒక పద్ధతైన, హోమ్లీ లుక్ ఉన్న 'పక్కింటి అమ్మాయి' అనే ముద్ర ఉంది. ఆమె కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఒక పూర్తిస్థాయి గ్లామరస్ ఐటమ్ సాంగ్‌లో నటించడం అనేది ఆసక్తికరమైన మలుపు. తనకున్న సాఫ్ట్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, మాస్ ప్రేక్షకులను మెప్పించేలా గ్లామర్ డాల్‌గా మారడం ఆమెకు ఒక పెద్ద సవాలుతో కూడిన నిర్ణయం. ఈ ప్రయోగం ఆమె కెరీర్‌ను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.

ఒక రకంగా చూస్తే ఇది మానస వారణాసికి రిస్క్‌ అనే చెప్పవచ్చు. సాధారణంగా ఒక నటి ఐటమ్ సాంగ్‌లో కనిపిస్తే, ఆమెపై గ్లామర్ పాత్రల ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. కానీ, ఈ పాటలో తన డ్యాన్స్ మరియు ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించగలిగితే, ఆమెకు టాలీవుడ్‌లో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు పెరగడంతో పాటు, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. ఇమేజ్ మార్చుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిదే అయినా, సక్సెస్ అయితే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది.

అంతేకాకుండా, 'పెద్ది' సినిమా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతోంది కాబట్టి, ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా మారుమోగిపోతాయి. ఒకవేళ ఈ ప్రత్యేక గీతం చార్ట్‌బస్టర్‌గా నిలిస్తే, మానస వారణాసికి దేశవ్యాప్త గుర్తింపు రావడం ఖాయం. ఇది ఆమె కెరీర్‌కు ఒక భారీ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ వార్తలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలే. ఈ విషయంలో వాస్తవమెంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.

Updated Date - Apr 09 , 2026 | 07:39 AM