సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

George Krish: చార్మింగ్ స్టార్ సరసన చార్మింగ్ బ్యూటీ!

ABN, Publish Date - Aug 25 , 2026 | 12:17 PM

శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ 'జార్జ్ క్రిష్‌'లో మానస వారణాసి హీరోయిన్‌గా ఎంపికైంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

Sharwanand - Manasa Varanasi

ఈ యేడాది సంక్రాంతి సీజన్ లో 'నారీ నారీ నడుమ మురారి'తో చక్కని విజయాన్ని అందుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఆ తర్వాత వచ్చిన 'బైకర్' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... నటుడిగా అతన్ని మరోసారి ఎలివేట్ చేసింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' చిత్రంలో నటిస్తున్నాడు శర్వానంద్‌. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ నటిస్తున్న 'జార్జ్ క్రిష్‌' చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ఇటీవల మొదలైంది. ఈ సినిమాను ఏటీవీ సమర్పణలో, అనిల్ సుంకర, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది.


'జార్జ్ క్రిష్‌' చిత్రంలో హీరోయిన్‌గా మానస వారణాసిని ఎంపిక చేసున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మానస ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ దర్శకుడు ఎం శశికుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో మానస నటిస్తోంది. అలానే మరో తమిళ చిత్రానికీ కమిట్ అయ్యింది. 'జార్జ్ క్రిష్‌'లో ఆమె సంప్రదాయ కుటుంబానికి చెందిన మోడ్రన్ అమ్మాయిగా కనిపించబోతోంది. సెప్టెంబర్ మాసం నుంచి మానస 'జార్జ్ క్రిష్‌' షూటింగ్‌ లో పాల్గనబోతోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

బీజేపీపై సంచలన ఆరోపణలు.. విజయ్ ‘టీవీకే’లోకి నటుడు దేవన్

'ఇరుముడి' సినిమాపై వివాదం! ఆ స‌న్నివేశాలు తొల‌గించాల‌ని డిమాండ్

Updated Date - Aug 25 , 2026 | 12:19 PM