Epic: ‘మనసా వాచా’ లిరికల్ వీడియో
ABN, Publish Date - Aug 20 , 2026 | 04:43 PM
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు.
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య (vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'(Epic). ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరకర్త. ఈ చిత్రం నుంచి ‘మనసా వాచా’ అంటూ సాగే లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు.
మెలోడీకి ప్రాధాన్యమిస్తూ ఆయన రూపొందించిన బాణీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని కె.ఎస్. చిత్ర, ఎస్.పీ. చరణ్ తమ విలక్షణమైన గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్యం కూడా పాటకు ప్రధాన బలంగా నిలిచింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.