సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందం.. అమాయకత్వం.. మాటతీరుకు ఫిదా...

ABN, Publish Date - Apr 02 , 2026 | 01:11 PM

ఒకప్పుడు టాలీవుడ్‌ మహిళా దర్శకులంటే భానుమతి, విజయనిర్మల, జీవిత, బి,జయ.. ఇలా కొందరి పేర్లే వినిపించేవి. ఇప్పుడు కాలం మారింది. ఉత్సాహం ఉన్న చాలామంది ఫీమేల్‌ డైరెక్టర్స్‌ టాలీవుడ్‌లో కనిపిస్తున్నారు.


ఒకప్పుడు టాలీవుడ్‌ మహిళా దర్శకులంటే భానుమతి, విజయనిర్మల, జీవిత, బి,జయ.. ఇలా కొందరి పేర్లే వినిపించేవి. ఇప్పుడు కాలం మారింది. ఉత్సాహం ఉన్న చాలామంది ఫీమేల్‌ డైరెక్టర్స్‌ టాలీవుడ్‌లో కనిపిస్తున్నారు. నందినీరెడ్డి, గౌరీ రోణంకి తో పాటు పలువురు తమ సత్తా చాటారు. తాజాగా మరో తెలుగమ్మాయి ఈ జాబితాలోకి చేరారు. ఆమె  మానస శర్మ. (Manasa Sharma). ‘రాకాస’ (Rakasa) సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈమె పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతుంది. అసలు ఎవరీ మానస శర్మ. ఇంతకు ముందు ఏం చేసేవారు..



మాసన శర్మ శ్రీకాకుళంలో పుట్టి పెరిగారు. అక్కడే చదువుకున్నారు. రైటర్‌గా యూట్యూబ్‌తో ఆమె జర్నీ మొదలైంది. 2019లో నిహారిక ప్రొడక్షన్‌ కంపెనీలో ‘మ్యాడ్‌ హౌస్‌’ సిరీస్‌కు రైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌ సిరీస్‌కు క్రియేటర్‌గా, రచయితగా వర్క్‌ చేసి ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ మధ్యనే ‘బెంచ్‌ లైఫ్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా మారారు. సోనీ లివ్‌ లో స్ర్టీమింగ్‌ అయిన ఈ వెబ్‌ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. షార్ట్‌ ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాసన ‘రాకాస’తో ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. వేదికపై ఆమెను చూసి చాలా మంది ఓయ్‌ సినిమా హీరోయిన్‌ బేబీ షామిలీలా ఉందనుకున్నారు. నిజం గానే మానస శర్మ అచ్చు గుద్దినట్లు షామిలీ లాగా ఉన్నారు. ప్రస్తుతం సంబంధిత వీడియోలు, మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మరి కొందరైతే ఆమెను హీరోయిన్‌ అనే అనుకుంటున్నారు. యాంకర్‌ సుమ సైతం తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అలాగే అన్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ‘బరి’ సినిమా ప్రారంభోత్సవంలో పవన్‌ను కలిసి మాట్లాడిన వీడియోలు, ప్రచార కార్యక్రమాల్లో మానస శర్మ మాటతీరు, అందం, అమాయకత్వం, తెలుగుదనం, సింపుల్‌ స్మైల్‌ చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. ‘కేవలం డైరెక్షనే కాదు, హీరోయిన్‌గా కూడా ట్రై చేయవచ్చు’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇప్పుడు మానస పేరు, ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇలా ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిన మానస ‘రాకాస’తో ట్రెండ్‌ సెట్టర్‌ అవుతారేమో చూడాలి. సంగీత్‌ శోభన్‌; నయన్‌సారిక జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Updated Date - Apr 02 , 2026 | 01:30 PM