సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మానస శర్మ:  అందమైన చందమామ కథలా సాగిపోతుంది..   

ABN, Publish Date - Mar 24 , 2026 | 04:31 PM

థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రమిది. కథ పూర్తిగా ఫిక్షన్. పాత్రలన్నీఅందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది.


'థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రమిది. కథ పూర్తిగా ఫిక్షన్. పాత్రలన్నీఅందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది' అని మానస శర్మ అన్నారు. 
పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం  ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం  గురించి దర్శకురాలు చెప్పిన విశేషాలు.. 

మాది శ్రీకాకుళం. మొదట యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశా. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్.  రాకాస’ని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. త్వరలోనే ట్రైలర్ రానుంది. అప్పుడు మా సినిమా గురించి ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. ఈ కథాను నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నయన్ సారిక మంచి నటి. డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. ఆల్రెడీ నేను ఇది వరకే ఆమెతో పని చేసి ఉన్నాను. ఆమె టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు.

15 నిమిషాల నెరేషన్ అంతే.. 

వెబ్ సిరీస్‌కి, సినిమాకి ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది.. రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. నిహారిక గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక గారు మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారిక గారికి నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తర్వాత నిహారిక గారికి చాలా కాన్పిడెంట్ వచ్చేసి ఓకే చెప్పారు. బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూ అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం. 

చందమామ కథలా..

‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రమిది. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందు సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది. నిహారిక గారు అనుదీప్ ని  సజెస్ట్ చేశారు. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. తదుపరి చిత్రాల  విషయానికి వస్తే ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా,ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తర్వాత వాటి గురించి చెబుతాను.

Updated Date - Mar 24 , 2026 | 04:33 PM