MSG: అనిల్ బల్ల గుద్దాడు.. నయన్ రూల్ బ్రేక్ చేసింది.. ఇక మోతే..
ABN, Publish Date - Jan 02 , 2026 | 05:55 PM
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సంక్రాంతికి థియేటర్‌లలో సందడి చేయనుంది.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సంక్రాంతికి థియేటర్‌లలో సందడి చేయనుంది. అప్పుడే అనిల్ తనదైన శైలి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. మెగా అభిమానులారా..! సంబరాలకు సిద్ధం కండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూడని సరికొత్త చిరంజీవిని చూడబోతున్నారు. అందుకు నాది గ్యారెంటీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం వెల్లడించింది.
జనవరి 4న ట్రైల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరు ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. మోకాలిపై కూర్చొని తుపాకీ పేలుస్తున్న స్టిల్స్ అభిమానులతో సీటీ కొట్టించేలా ఉంది. అంతే కాదు ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ప్రమోషన్‌కు ఆమడ దూరం ఉండే నయనతార ఈ సినిమా ప్రారంభంలో ఓ వీడియో చేసి సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పుడు సినిమా విడుదలకు ముందు కూడా అలాంటి ఓ వీడియో చేసింది. ఇప్పటి వరకూ ఆమె పాటించిన రూల్స్‌ను బ్రేక్ చేసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇదంతా ఆడియన్స్‌కు ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే!
తాను నటించిన విమెన్ ఒరియెంటెడ్ చిత్రాలను కూడా ఆమె ప్రమోట్ చేయలేదు. కానీ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ఆ రూల్‌ని బ్రేక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నయన్ స్వయంగా వచ్చి మూవీ ప్రమోషన్స్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగటం.. ఆయన కళ్లు తిరిగి పడిపోవడం నవ్వులు పూయిస్తోంది. అనిల్ దగ్గర ఏదో మంత్రదండం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.